తెలుగు ప్రజల ప్రియతమనేత డా.వైఎస్సార్
Ens Balu
3
Anantapur
2020-09-02 12:38:31
తెలుగు ప్రజల ప్రియతమ నేత డా.వైఎస్సార్ చిరస్థాయిగా పేద గుండెల్లో నిలిచిపోతారని రాష్ట్ర రహదాలు, భవనాల శాఖ మాత్యులు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. బుధవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద , ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా హృదయనేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి శంకరనారాయణ అంజలి అర్పించారు. అనంతరం, వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మంత్రి శంకరనారా యణ వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాలలు అశృనివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నదీం అహ్మద్, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, పైలా నర్సింహయ్య, రాగే పరశురాం తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.