వైయస్సార్ ఆశయసాధనకు కృషి..జర్నలిస్టు నేత గంట్ల
Ens Balu
6
Ramakrishna Beach
2020-09-02 13:39:39
మహానేత మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు విశాఖలో బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్ లో పామ్ బీచ్ హోటర్ దగ్గర వున్నడా.. వైఎస్ఆర్ విగ్రహానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వ ర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూర్తి స్థాయిలో కృషి చేశారని కొనియాడారు. పేదల పక్షపాతి గా నిలిచారని, నిరంతరం వారి కోసమే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత వైస్సార్ కే దక్కుతుంది అన్నారు. ఈతరం రాజకీయ నాయకులకు వైఎస్సార్ ఒక మార్గదర్శి కీర్తించారు. ఆయన ఆశయ సాధను ప్రతీ ఒక్కరూ క్రుషిచేయాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 44 వ వార్డు కు చెందిన జ్ఞానాపురం వైయస్సార్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మురళి, చరణ్, ఫ్రాన్సిస్ సునీల్ ,మరియదాసు తదితరులు పాల్గొన్నారు.