స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దు...


Ens Balu
4
Tirupati
2020-09-02 17:03:37

స్పందన, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాల ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని  తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికా రులను ఆదేశించారు. బుధవారం ఈ మేరకు వివిధ విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరీష మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే వాటిలో వచ్చే సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్న కమిషనర్ స్పందనలో వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా  పరిష్కరించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తెస్తే నేనే స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,  మేనేజర్ హాసిమ్, ఆరోగ్య శాఖాధికారిని సుధారాణి, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, గాలి సుధాకర్, డి.ఈ. లు, వివిధ శాఖల విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.