డా.వైఎస్సార్ ని ప్రతీ గుండె గుర్తుపెట్టుకుంటుంది..మను


Ens Balu
1
Seethampeta
2020-09-02 18:38:58

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి నిరుపేదల కోసం చేసిన మేలుని ప్రతీ గుండె గుర్తుపెట్టుకుంటుందని మను ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మనుపల్లా అన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని సీతంపేటలో నిరుపేదలకు పండ్లు, పిల్లలకు పాఠ్యపుస్తకాలు నోట్సులు పంపిణీ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్ పేదల పెన్నిది, ఆయన సీఎం వైఎస్ జగన్ డైనమిక్ అని కొనియాడారు. బిసి సంఘం యువజన విభాగం మహిళా కార్యదర్శి దనుకోటి రమ మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా నేటికీ ఎందరో నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందుతోందన్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ కూడా తండ్రిని మించిన తనయుడిగా నిరుపేదలకు మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. అలాంటి మహానేత వర్ధంతి సందర్భంగా మను ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. అధ్యక్షురాలు జయ మాట్లాడుతూ, మహిళలు ఆర్ధికంగా ఎదగడానికి చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్ధిక సహాయం చేసిన మనసున్న సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.