రేపు రాష్ట్రవ్యాప్తంగా బొమ్మన రాజ్ కుమార్ కి నివాళులు..
Ens Balu
2
Eluru
2020-09-02 18:47:07
చేనేత కులాల ఐక్యతకు, చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగం అభివృద్ధికి కీ.శే బొమ్మన రాజ్ కుమార్ ఎంతగానో క్రుషి చేశారని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యధర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరేలా, సేవలను స్మరిస్తు రేపు తేది 03.09.2020 ఉదయం 11 గంలకు 5 నిమిషాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చేనేత కుల సంఘాలు, ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యవర్గం, అనుభంద సంఘాలు కొవోత్తులు వెలిగించి మౌనం పాటించి నివాళులు అర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బొమ్మన రాజ్ కుమార్ వలన చేనేత రంగం ఎంతగానో అభివ్రుద్ధి చెందిందని, ఆయన లేని లోటు తమ రంగానికి ఎన్నటికీ తీరదన్నారు. ప్రతీ చేనేత కార్మికుడు అభివ్రుద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేసిన ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయ సాధనకు ప్రతీ నేత కుటుంబం క్రుషి చేయాలని అన్నారు.