ప్రజలకు అనుకూలంగా పార్కులను తీర్చిదిద్దాలి...
Ens Balu
3
Tirupati
2020-09-02 19:14:09
పచ్చని చెట్లు, రంగు రంగుల పుష్పాలు, విశాలమైన క్రీడా మైదానంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉన్న తిరుపతిలోని ప్రకాశం పార్కును ప్రజల సందర్శనార్థం బుధవారం నుంచి తెరిచారు. లాక్ డౌన్ 4 నిబంధనల మేరకు తెరిచిన పార్కును బుధవారం సాయంత్రం నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా సందర్శించారు. పార్కులో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కుకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు సానీటైజర్ వినియోగించేలా ప్రవేశ మార్గం వద్ద సానీటైజర్ స్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు. జనం గుంపులు గంపులుగా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏపుగా పెరిగిన మొక్కలను కట్ చేసి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అంతేకాకుండా పాచికను కట్ చేసి లాన్ ను బాగా ఏర్పాటు చేయాలన్నారు. పచ్చిక ఉన్నచోట ఎవరు ఎటువంటి ఆటలు ఆడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆటల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఆడుకునేలా అందరికీ తెలియజేయాలన్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్న కమిషనర్ సందర్శకులు అక్కడక్కడా చెట్ల కింద కూర్చుని సేద తీరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కుకు ఎక్కువగా వచ్చే వారికి నెలవారీ కార్డు ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే మునిసిపల్ సిబ్బందికి యోగ క్లాస్ లు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డి.ఈ. లు విజయకుమార్ రెడ్డి, గోమతి, రెవిన్యూ ఆఫీసర్ సేతుమాదవ్, బాలాజీ, తదితరులు ఉన్నారు.