విశాఖ జిల్లాకి కూడా కరోనాకి సెప్టెంబరు నెల కీలకమే


Ens Balu
3
కలెక్టరేట్
2020-09-02 19:32:30

విశాఖపట్నం జిల్లా  కోవిడ్ నియంత్రణలో సెప్టెంబరు నెల కీలకంగా మారనున్నదని  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు.  బుధవారం  కలెక్టర్ కార్యాలయం నుంచి  జిల్లాలోని  అర్బన్, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో  కోవిడ్ నివారణ చర్యలపై  ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన  కాంట్రాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్ జోన్ ల నియంత్రణ  పకడ్బందీగా చేయాలని తెలిపారు.  నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు  ఆ నియోజక వర్గంలో  అందుబాటులో ఉండి ప్రతిరోజు  పర్యవేక్షించాలని తెలిపారు.  హోం ఐసోలేషన్ లో ఉన్నరోగుల ఇంటికి వెళ్లి పరీక్షించిన తుమ్మపాల , మధురవాడ, ఆర్. తాళ్లవలస, మునగపాక , కశింకోట, చౌడువాడ ప్రాదమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.  జిల్లాలో  జి.వి.ఎం .సి పరిధిలో  ఎక్కువ కేసులు వస్తున్నాయని, ఎక్కడైనా పాజిటివ్ కేసును గుర్తించగానే  200 మీటర్ల పరిదిలో కంటైన్మెంట్ జోన్ గా మార్కింగ్ చేసి  డోర్ టు డోర్ సర్వే చేయాలని తెలిపారు.  104 వాహనాన్ని ఫివర్ క్లినిక్ లుగా వినియోగించి పరీక్షలు చేయాలని తెలిపారు.    గ్రామ,     వార్డు సచివాలయ  సిబ్బంది ప్రైమరి కాంటాక్ట్ లు , సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించాలని  తెలిపారు. గర్బీణీలు, 60 సంవత్సరముల పైబడిన , ఇతర రోగాలు  ఉన్న   హైరిస్క్   వ్యక్తులను గుర్తించాలని తెలిపారు. డేటాను ఎప్పటి కప్పుడు  అప్ లోడ్ చేయాలని తెలిపారు.  జి.వి.ఎం .సి పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్, కంటెన్మెంట్ జోన్ ల మ్యాపింగ్  ఆలస్యం జరుగుతుందని, తొందరగా పూర్తి చేయాలని తెలిపారు.  కంటెన్మెంట్ జోన్ పరిధిలో  శానిటేషన్ చేయించాలని, ఆటోలను వినియోగించి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని  తెలిపారు. జి.వి.ఎం .సి పరిధిలో  72 అర్బన్ పి హెచ్ సిలలో  మెడికల్ ఆఫీసర్లు, నర్సుల నియామకం పూర్తయ్యిందని తెలిపారు.  కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో ట్రూనాట్ లాబ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సి హెచ్ సి , ఏరియా ఆసుపత్రుల డాక్టర్లు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. త్వరలో మొబైల్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ లు ఏర్పాటు చేస్తామని తలిపారు.  హోంఐసోలేషన్ నిర్వహణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదని, హోం ఐసోలేషన్ లో ఉన్నరోగుల ఆరోగ్య పరిస్థితిని  ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. హోం ఐసోలేషన్ లో ఉన్నరోగుల మానిటరింగ్ కు జిల్లా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   పి.హెచ్ సి ల మెడికల్ ఆఫీసర్లు, ఆశా లు , ఏ ఎన్ ఎం లు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.  హోం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులకు శ్వాస ఇబ్బందిగా ఉండటం, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం జరిగితే  తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే  ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి కమ్యూనిటి హెల్త్ సెంటర్, ఏరియా ఆసుపత్రిలో  ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసారని తెలిపారు. అవసరమైన మాస్క్ లు , పి పిఈ కిట్ లు, ఇతర మెటీరియల్ లు అందుబాటులో ఉన్నాయని   తెలిపారు.   ట్రయాజింగ్ యాప్ లో మెడికల్ ఆఫీసర్లు డేటాను  అప్ డేట్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో   జాయింట్ కలెక్టర్ గోవిందరావు , ఎయం సి ప్రిన్సిపాల్ సుధాకర్, ఇన్ చార్జి  డి ఎం హెచ్ ఓ విజయలక్ష్మి, డి సి హెచ్ ఎస్ లక్ష్మణరావు , ఇతర అధికార్లు పాల్గొన్నారు.