వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు తుగ్లక్ ఆలోచన...
Ens Balu
3
Narsipatnam
2020-09-02 20:03:51
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు మరో తుగ్లక్ నిర్ణయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్రంగా విమర్శించారు. రైతులపై మోయలేని భారం వేసేందుకు జగన్ పథకం రూపొందించారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం వీడియో సందేశం పంపారు. రైతులకు మేలు చేయాలని ఎన్టీ రామారావు ఆరోజుల్లోనే ఆస్పవర్ కు రూ.50లు విద్యుత్ బిల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రతి మోటారుకు మీటరు పెట్టాలన్న దౌర్బాగ్యపు ఆలోచన జగన్ తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ నగదు బదిలీ అంటూ చేసే ఆలోచన అర్థం కావడంలేదన్నారు. 30 ఏళ్లలో లేని నిర్ణయాలు ఇప్పుడెందుకని, మళ్లీ అప్పులు చేయడానికా? అని ప్రశ్నించారు. రైతులతో చర్చించకుండా ఇలాంటి నిర్ణాయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. 18 లక్షల మోటార్లకు ఎంత బిల్లులు అవుతుందో ప్రభుత్వానికి తెలుసునని, ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లింస్తే బాగుంటుదని సూచించారు. రైతులకు అకౌంట్లలో నగదు వేస్తామని చెప్తున్నారు..వేయకుంటే పరిస్థితేంటని ప్రశ్నించారు. రైతులకు వడ్డీలేని రుణాలిచ్చి ఆ వడ్డీని తానే చెల్లిస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకు బ్యాంకులకు చెల్లించలేదని దుయ్యబట్టారు. దీంతో బ్యాంకులు రైతులపై ఒత్తిడి తెస్తున్నాయని, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకపోతే రైతుల పరిస్థతి ఏమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రైతు సంఘాలు కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, యూరియా దొరక్క, గిట్టుబాటు ధరల్లేక పంటలను కొనేనాదుడు లేరన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టని పథకాన్ని రద్దు చేసి మళ్లీ జగన్ ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. రైతులు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్రంలో 55 శాతం మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.