సీజనల్ వ్యాధులపై కార్యదర్శిలు అవగాహన కల్పించాలి..
Ens Balu
2
వుడా చిల్డ్రన్స్ థియేటర్
2020-09-02 20:16:30
సీజనల్ వ్యాదుల నివారణపై ప్రజలలో అవగాహన కలిగించాలని వార్డు సెక్రటరీ ప్రతీ రోజూ ఇంటింటి సర్వే జరపాలని జివిఎంసీ కమీషనర్ డా.స్రిజన ఆదేశించారు. బుధవారం ఉడా చిల్డ్రన్స్ థియేటర్ ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషర్ పలు అంశాలను సమీక్షించారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు శతశాతం జరగాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు ఆదేశించారు. అనంతరం సచివాలయం వారిగా ప్రతీ ఇంటినుండి చెత్త విభజన, సేకరణ ఎంత జరుగుతున్నదో, ఎన్ని ఇళ్ల వద్ద ఎరువును తయారు చేస్తు న్నారని వివరాలను, ఒక్కరోజుకు ఏ యే చెత్త ఎంత ఉత్పత్తి అవుతున్నదీ, సూయజ్ ఫారంలో ఎంత డిపాజిట్ అయిందనే వివరాల నివేదికను సిద్ధం చేయవల సిన దిగా అదనపు కమీషనరుకు ఆదేశించారు. అనంతరం నగరంలో ఎన్ని డంపర్ బిన్నులు, కాంపేక్టరు బిన్నులు, ట్విన్ బిన్నులు ఉన్నాయి? ఎన్ని రిపేరు చేసి ఉన్నా యి? ఎన్ని శిధిలావస్థలో ఉన్నాయి ? ఎన్ని తోపుడు బళ్ళు ఉన్నాయనే వివరాలను ఎగ్జెక్యూటివ్ ఇంజినీరు చిరంజీవిని కమీషనర్ అడిగితెలుసుకున్నారు. 6 నెలల క్రితం రిపేరు చేయించినవి మరలా రిపేరు స్థితికి వచ్చిన వాటిపై ఆరా తీశారు. వాటి వివరాలను నివేదిక రూపంలో వెంటనే అందించాలని ఎగ్జెక్యూటివ్ ఇంజినీరు చిరంజీవిని ఆదేశించారు. అనంతరం నగరంలో ఇళ్లకు ఉన్న సెప్టిక్ ట్యాంకు వివరాలు, యు.జి.డి. కనెక్షన్ వివరాల విషయమై, సెప్టిక్ ట్యాంకు ఉన్న ఇంటివద్ద యు.జి.డి. కనెక్షన్ వ్యవస్థ కలిగిఉంటే వెంటనే అటువంటి ఇళ్లకు యు.జి.డి. కనెక్షన్లు నెల రోజులలో ఇవ్వాలని, అలా లేని ఇళ్లకు సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ చేయించుకునే ఏర్పాట్లు చేయాలని సూపెరింటెండింగ్ ఇంజినీరు వేణుగోపాల్ ను ఆదేశించారు.