స్వచ్ఛ సర్వేక్షణ్ పనులపై అధికారులు ద్రుష్టి పెట్టాలి..


Ens Balu
2
ఉడా చిల్డ్రన్స్ థియేటర్
2020-09-02 20:21:40

స్వచ్ఛ సర్వేక్షన్-2021 పనులలో భాగంగా ప్రతీ వార్డులో వారానికొక సారి  నివాసిత సంక్షేమ సంఘాలు, సోషల్ ఆర్గనైజషన్లతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమీషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. బుధవారం వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ వస్తువులు నిషేదించడమైనదని, 50 మైక్రాన్లలోపు ప్లేస్టిక్ క్యారీ బ్యాగులు ఉపయోగించరాదని, ప్లేస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా స్టీలు, గాజు, పేపరు, గుడ్డ లేదా నారతో తయారు చేసిన మొదలగు వస్తువులను ఉపయోగించేటట్లు ప్రజలకు అవగాహన పరచాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు కమీషనర్ ఆదేశించారు.  అనంతరం, స్వచ్ఛ సర్వేక్షన్-2021 అంశాలలో భాగంగా అన్ని జోన్లలో అత్యుత్తమ సేవలు కనబరిచిన 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలను అందించి వారిని కమీషనర్ అభినందించారు. అక్టోబరు 2వ తేదీన, ఒక లక్ష డస్ట్ బిన్లు ఉచితంగా పేదవారికి సరఫరా చేయటకుగానూ, డస్ట్ బిన్లు కొనుగోలు చేసుకోలేని పేదవారి వివరాలను సిద్ధం చేయమని సహాయ వైద్యాధికారులను కమీషనర్ సూచించారు. కోవిద్ వ్యాధి సోకిన వారి ఇంటిలో శానిటైజ్ చేయాలని, ఆ ఇంటి బయట సోడియం హైపో క్లోరైట్ ద్రావకం, బ్లీచింగ్ చల్లించే ఏర్పాట్లు తప్పని సరిగా జరగాలని ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో, అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, ఎగ్జెక్యూటివ్ ఇంజినీర్లు, సహాయ వైద్యాధికారులు, ఏ.సి.పి. లు, శానిటరీ సూపెర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.