104 వాహనాలే ఫీవర్ క్లినిక్ లు...జిల్లాకలెక్టర్
Ens Balu
3
కలెక్టరేట్
2020-09-03 11:25:30
104 వాహనాన్ని ఫివర్ క్లినిక్ లుగా వినియోగించి కరోనా పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విశాఖలో వైద్య, ఆరోగ్యశాఖ, జీవిఎంసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో మొబైల్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ లు ఏర్పాటు చేస్తామని తలిపారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రైమరి కాంటాక్ట్ లు , సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించాలని తెలిపారు. గర్బీణీలు, 60 సంవత్సరముల పైబడిన , ఇతర రోగాలు ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించాలని తెలిపారు. డేటాను ఎప్పటి కప్పుడు అప్ లోడ్ చేయాలని తెలిపారు. జి.వి.ఎం .సి పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్, కంటెన్మెంట్ జోన్ ల మ్యాపింగ్ ఆలస్యం జరుగుతుందని, తొందరగా పూర్తి చేయాలని తెలిపారు. కంటెన్మెంట్ జోన్ పరిధిలో శానిటేషన్ చేయించాలని, ఆటోలను వినియోగించి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జి.వి.ఎం .సి పరిధిలో 72 అర్బన్ పి హెచ్ సిలలో మెడికల్ ఆఫీసర్లు, నర్సుల నియామకం పూర్తయ్యిందని తెలిపారు. కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో ట్రూనాట్ లాబ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సి హెచ్ సి , ఏరియా ఆసుపత్రుల డాక్టర్లు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.