ఘన, వ్యర్ధ పదార్థా నిర్వహణకు యూజర్ చార్జీలు..


Ens Balu
3
Tirupati
2020-09-03 14:16:39

తిరుపతి నగరపాలక సంస్థ పరిధి లోని నివాస గృహాలు, వాణిజ్య సముదాయముల నుంచి చెత్త సేకరణకు ఇకపై యజూర్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుం దని కమిషనర్ గిరీష చెప్పారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, యూజర్ ఛార్జీల వివరాలు తెలియజేశారు. నివాస గృహాలు- రూ  30, వాణిజ్య సముదాయాలు, హాస్టళ్లు, మరియు అతిథి గృహాలు, మొదలగు వాటిపై 100 నుండి500 వరకూ నిర్ణయించామన్నారు. అదే విధంగా ప్లాస్టిక్ వినియ గించినా అమ్మినా, వాడినా 5 వేల నుంచి పదివేల వరకు జరిమానా వేస్తామన్నారు. రోడ్లలో,కాలవలో వ్యర్థాలు  వేసినా కూడా  జరిమానలు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వినియోగదారులు చెత్త సేకరణ కొరకు, యూజర్  చార్జీలు చెల్లించాల్సి వుంటుందన్నారు. నిరంతరాయంగా పారిశుధ్య నిర్వహణ, గన, వ్యర్ధ పదార్ధల కోసం నిర్ణయించిన యూజర్ చార్జీలకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. మునిసిపల్ ఘన వ్యర్థాలు మరియు సంబంధిత పారిశుద్ధ్య వ్యర్థాల నిల్వ, సేకరణ, రవాణా, మరియు పారవేయడంతో అనుసంధానించబడిన అన్ని విషయాలను నియంత్రించడానికి వినియోగదారుల నుండి యూజర్ చార్జీలు సేకరించాలని నిర్ణయించామని కమిషనర్ గిరీష వివరించారు.