రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
3
Srikakulam
2020-09-03 14:35:07

శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలబాలికలు, సంస్థలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకోసం  ఈ నెల 15లోగా ఆన్ లైన్ లో నామినేషన్ చేసుకోవాలని ఐసిడిఎస్ పిడి డా. జి.జయదేవి తెలియజేశారు. గురువారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాంస్కృతిక, కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యం, సాహస రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలలు, బాలల రక్షణ, అభివృద్ధి సంక్షేమం కొరకు పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేస్తుందన్నారు. ఇందులో బాలశక్తి, బాలకళ్యాణ్, సంస్థల పురస్కారాల కేటగిరీలు ఉంటాయని ఆమె వివరించారు. పురస్కార గ్రహీతలకు 2021 గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి పతకంతో పాటు ఐదు లేదా లక్ష రూపాయల నగదు, ధృవపత్రాలను అందజేస్తారన్నారు. ప్రధానమంత్రితో సన్మాన కూడా చేస్తారన్నారు. అర్హులైన బాలలు, వ్యక్తులు, సంస్థలు ఈ నెల 15లోగా www.nca.wcd.nic.in ఆన్ లైన్ లో నామినేషన్లను సమర్పించాలని ఆమె కోరారు. ఇతర సమాచారం కొరకు పథక సంచాలకులు,  జిల్లా మహిళా, శిశుఅభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని గాని లేదా 08942-240630 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.
సిఫార్సు