బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీరని లోటు
Ens Balu
7
Yemmiganooru
2020-09-03 15:45:32
ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర్ గౌరవ అధ్యక్షలు, బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీర ని లోటుఅని ఫ్రంట్ రాయలసీమ ప్రధాన కార్యద ర్శి బుట్టా రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కీ.శే బొమ్మ న రాజ్ కుమార్ కి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా పొలిటి బ్యూరొ సభ్యులు యం.ఆర్ శ్రీనివాసులు ,రాష్ట్ర కార్యదర్శి డా"గణెష్ మాట్ల డుతూ, ఫ్రం ట్ ఒక ధార్శికతను కోత్పోయిందన్నారు. చేనేతల కోసం ఎన్నో సామాజిఖ పోరాటాలు చేసి వారికి లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి ఉన్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. రాష్ట్ర వై యస్ ఆర్ నాయకులుగా చేనేత కులాల ఐక్యతకు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం, హర్నిశలు పని చేశారని శ్రీశైలం ధర్మసత్రం అద్యక్షులు, రాజమండ్రి అర్బన్ బాంక్ చైర్మన్ గా కోన సాగుతూ, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా, రాష్ట్రంలో ఉన్న చేనేత కులా సంఘాల సమన్వయ కర్తగా ఎన్నోసేవలు చేశారన్నారు. అంతకు ముందు బొమ్మన రాజ్ కుమార్ చిత్ర పటానికి పూల మాల వెసి శ్రధ్ధాంజలి ఘటించి ఐదు నిమిషాలు మౌను పాటించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కొశాధి కారి విశ్వనాథ్ రఘు,6వ వార్డు ఇంఛార్జి శివ,టైలర్ శీను తథి తరులు పాల్గొన్నారు.