ప్లాస్మాదానం దానానికి ముందుకురావాలి..డిఎంహెచ్ఓ


Ens Balu
4
Visakhapatnam
2020-09-03 16:55:07

విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 బాదితులకు ప్లాస్మా తెరపీ చేయుటకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకి రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈమేరకు విశాఖలోని గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చి, కోలుకున్న28 రోజుల తర్వాత ఎవరైనా ప్లాస్మా దానం చేయవచ్చునని వివరించారు. కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నవారు ఈ ప్లాస్మా దానం చేయుటకు ముందుకు రావాల న్నారు. ప్లాస్మా దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి రూ. 5,000/- ల నగదు ప్రోత్సాహకం అందజేస్తారని కూడా ఆమె వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వి.వినయ్ ప్రకటించడంతోపాటు, దాతలు మంచి మనసుతో ముందుకి రావాలని కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  ప్లాస్మా దానం చేయదల్చిన వారు డా.సిహెచ్. శ్రీధర్ సర్వేలెన్స్ అధికారి,8790407037వద్ద సంప్రదించాలని కోరారు. ఆపదలో ఉన్న కరోనా రోగులకు ప్లాస్మాదానం చేసి వారికి ప్రాణదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.  
సిఫార్సు