తిరుపతి మరో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు..కమిషనర్


Ens Balu
3
Tirupati
2020-09-03 17:05:47

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో  ఎన్ హెచ్ఎం కింద 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. గురు వారం నగర పాలక సంస్థ కార్యాలయం అర్బన్ రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, అర్బన్, నగరపాలక సర్వేలు, ఆరోగ్య విభాగాల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఆరు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలు పరిశీలించి, వాటికి సంబంధించి నివేదికను కలెక్టర్ నివేదించాలన్నారు. నడుచుకుంటూ వెళితే 15 నిమిషాల్లో ఆరోగ్య కేంద్రాల్లో చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్ప టికే నగరపాలక సంస్థ పరిధిలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్న కమిషనర్ కొత్తగా నిర్మించే వాటితో అన్నివర్గాల వారికి వైద్యసేవలు అందుతాయన్నారు. అంతకుముందు అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కమిషనర్ పరిశీలించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, షణ్ముగం,డిఈ. విజయ్ కుమార్ రెడ్డి, అర్బన్, నగరపాలక సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్, రమేష్, మున్సిపల్ ఉప గణాంక అధికారి నీలకంటేశ్వర రావు, ఆరోగ్య విస్తరణ అధికారి మోహన్ తదిత రులు పాల్గొన్నారు.
సిఫార్సు