కెజిహెచ్ సీఎస్ఆర్ బ్లాకులో కోవిడ్ రోగులకు వసతి..


Ens Balu
0
కెజిహెచ్
2020-09-03 17:27:13

విశాఖ  కె.జి.హెచ్.లో సి.యస్.ఆర్. బ్లాక్ కోవిడ్-19 పేషెంట్లకు రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నదని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించా రు.కె. జి.హెచ్. లో కొత్తగా నిర్మించిన సి.యస్.ఆర్. బ్లాక్ ను గురువారం ఆయన సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.  బ్లాక్ అంతటినీ క్షణ్ణంగా పరిశీలించారు.  150 ఐ.సి. యు. పడకలతో, ఆక్సిజన్ ఉన్న 500 పడకలతో రెండు మూడు రోజుల్లో కోవిడ్-19 పేషెంట్లకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.  మూడు ఆపరేషన్ థియే టర్లు, ఆ బ్లాక్ లోనే ఒక ల్యాబ్, పేషెంట్ల అటెండెంట్లకు పేషెంట్ల సమాచారం తెలియజేసేందుకు ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రతీ రూంలో ను సి.సి. కెమెరా ఉంటుందని, దీనిని మోనిటరింగ్ చేయడానికి ఒక రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్పించిన సౌకర్యాలు ఎంత ముఖ్యమో సర్వీసు కూడా అంతే ముఖ్యమని వైద్యులను ఆదేశించారు.  కె.జి.హెచ్. ఒక చారిత్రాత్మకత గల ఆసుపత్రి అని, కె.జి.హెచ్.  రాష్ట్రంలో నంబర్ ఒన్ లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు కె.జి.హెచ్ పర్యవేక్షకులు డా. పి.వి. సుధాకర్,  ఎపిఎంఐడిసి ఇఇ ఉమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు