వెబ్ సైట్ లో పారామెడికల్ ఉద్యోగాల మెరిట్ లిస్టు.. dmho
Ens Balu
3
Visakhapatnam
2020-09-03 19:39:54
విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాప్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల పైనల్ మెరిట్ లిస్ట్ జాబితా 3-09-2020 తేదీన http://Visakhapatnam.nic.in వెబ్ సైటు నందు పొందు పరచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారిణి డాక్టర్ విజయలక్ష్మి తెలియజేయశారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించుకొని, తమ అభ్యంతరాలు ఏమైనా ఉన్నచో 04-09-2020 సాయంత్రం 5.00 గంటల లోపు రాత పూర్వకముగా, తగు డాక్యుమెంట్ ఆధారాలతో విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో తెలియజేయాలన్నారు. మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు పరిశీలిస్తామన్నడీఎంహెచ్ఓ.. ఇతర అభ్యర్థుల మెరిట్, సర్విస్ సర్టిఫికేట్, దృవ పత్రాల విషయాలలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో తమ దృష్టికి తీసుకు వచ్చినచో పరిశీలనకు దస్త్రాలను చూపిస్తామన్నారు. జిల్లా కలెక్టరు ఉత్తర్వుల మేరకు మొత్తం ప్రక్రియ నియమ నిబంధనలు అనుసరించి మాత్రమే నిర్వహించామన్నారు.