ఫ్లోటింగ్ జట్టీ నిర్మాణాలకు స్థల పరిశీలన..


Ens Balu
4
Tippalavalasa Beach
2021-07-30 15:49:28

విజయనగరం జిల్లాలోని తిప్పలవలస, ముక్కం ప్రాంతాల్లో అనువైన ప్రాంతాల్లో ప్రభుత్వం ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోలాగురువులు పేర్కొన్నారు. శుక్రవారం మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆధ్వర్యంలో నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ వాటర్ వేస్ అండ్ కోస్ట్స్ ప్రాజెక్టు అసోసియేట్ శ్యామ్ విలియమ్స్, కార్పోరేషన్ చైర్మన్ లు సంయుక్తంగా ఇక్కడి ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప సంచాలకులు నిర్మలకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం సముద్రతీర ప్రాంతాల్లోని ముఖ్యమైన అనువైన ప్రాంతాల్లో ఫ్లోటింగ్ జెట్టీలను నిర్మించ నుందని, ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రాంతాలను పరిశీలించామన్నారు. దానితోపాటు ఏ ప్రాంతంలో జెట్టీల నిర్మాణం చేపడితే బాగుంటుందో స్థానిక మత్స్యకారులు, చైర్మన్ సలహాలు కూడా చెన్నై ప్రతినిధి నమోదు చేసుకున్నారన్నారు. ఈ పర్యటన, వివరాలు, ప్రాంతాల నివేదిక ఆధారంగా ప్రభుత్వం జెట్టీలను మంజూరు చేయనుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.