2016లో ఆక్రమణ..నేడు అపార్ట్ మెంట్ల నిర్మాణం..అయినా


Ens Balu
3
Madhurawada
2020-09-04 13:42:09

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా 2016లో ఖబ్జా చేశారు. ఇపుడు అంతస్తుల మీద అంతస్తులు అనధికారికంగా నిర్మించేస్తు న్నా రు. కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వం రక్షించే ప్రయంత్నం చేయలేదు అంటున్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు. మధురవాడ సర్వే నెం 367 లో గల సుమారు 100 కోట్ల విలువైన 9.27 ఏకరముల ప్రభుత్వ భూమిలో దర్జాగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిచిన ఆక్రమణ దారులను తక్షణమే చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమండ్ చేస్తున్నారు. అంతే కాదు..  2016 ఆగష్టు నెలలో ఈభూమి అన్యాక్రాంతం జరిగిన అంశం గుర్తించి సీపీఐ తరుపున అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ చేసిన ఫిర్యాదు అంశాన్ని తాజాగా జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కి చేసిన ఫిర్యాదులో పేర్కొని మెయిల్  సమర్పించినట్టు ఆయన మీడియాకి చెప్పారు. అభూమి ప్రభుత్వ భూమని రెవిన్యూ రికార్డులను మార్చి,అందులో నిర్మిస్తున్న భవనాలు అక్రమంగా నిర్మిస్తున్న వేననితేల్చి,ఆ భవనాలు నిర్మాణానికి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేసి నాలుగు సం"గడిచినప్పటికి నేటికి అవి కార్యరూపం దాల్చకపోవడం అవినీతేనని ఆరోపించారు. ఇటువంటి అంశములు వెలుగులోకి రాగానే అధికారులు కొద్దిగా హడావుడి చేసి వదిలివేయడం చాలా దారుణమన్నారు. అంతేకాదు గడిచిన నాలుగేళ్లుగా ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలపై కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని పైడిరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం లో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేస్తున్న తరుణంలో తక్షణమే ఆ విలువైన ప్రజా ఆస్థిని  స్వాధీనం చేసుకొని ప్రభుత్వ,ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు...
సిఫార్సు