అమృత్ పనులు వేగంగా పూర్తిచేయాలి...కమిషనర్ గిరీష


Ens Balu
3
Tirupati
2020-09-04 14:18:15

తిరుపతి నగరపాలక పరిధిలో జరుగుతున్న అమృత్ పథకం పనులు వేగవంతం గా పూర్తి చేయాలని నగరపాలక సంస్త కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  పనుల్లో ఆలస్యం చేస్తే కాంట్రాక్టు రద్దు చేస్తామని కమిషనర్ గిరీషా  కాంట్రాక్టర్లను హెచ్చరించారు.  నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు నీటి సరపరాకై అమృత్ పథకంలో పైపులైన్, ట్యాంకుల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ పనుల్లో ఆలస్యం చేయడంవలన ప్రజలకు మంచినీటి కష్టాలు తీరకపోగా పెరుగుతాయన్నారు.  సకాలంలో కాంట్రా క్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నా,  ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యలు చూపుతూ పనులు ఆలస్యం చేస్తే సహించే ది లేదని అధికారులను హెచ్చరించారు. అన్ని చోట్లా ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నామన్న కమిషనర్ పెండింగ్ పైప్ లైన్ పనులు   వారంలోపు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా త్రాగునీటి కొత్త కనెక్షన్లు కావాలంటే వారికి ఇవ్వాలన్నారు. కొన్ని చోట్ల యూ.డి.జి. పైప్ లైన్ అడ్డుగా ఉండడంతో వాటర్ పైప్ లైన్ ఆలస్యం అవుతోందని కాంట్రాక్టర్లు చెప్పారు. ఏది ఏమైనా పనులు సర్దుబాటు చేసుకుని పనులు పూర్తి చేయలన్నారు. పైప్ లైన్ ఆలస్యం వలన రాజీవ్ నగర్ లో సి.సి.రోడ్ పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెప్పడంతో ఎక్కువ మందిని పెట్టి పనులు పూర్తి చేయాలని కమిషనర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. పైప్ లైన్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే అక్కడ గుంతలు పూడ్చి వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్.ఈ. చంద్రశేఖర్, ఎం.ఈ.2 వెంకట్రామిరెడ్డి, డి.ఈ లు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రఘుకుమార్, గోమతి, రవీంద్ర రెడ్డి, ఏ,ఈ. లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
సిఫార్సు