గడువులోగా గరుడ వారధి నిర్మాణం పూర్తికావాలి...
Ens Balu
2
తిరుపతి
2020-09-04 18:39:48
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుగున్న గరుడవారధి పనులను సత్వరమే పూర్తిచేయాలని కమిషనర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు ఎక్కువ కాలం చేయడం వాహన చోదకులకు చాలా ఇబ్బందులుంటాయని, వాటిని నిరోధించాలంటే పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం కరకంబాడీ మార్గంలోని బొంతాలమ్మ ఆలయం సమీపంలో జరుగుతున్న వినాయకసాగర్ నిర్మాణ పనులను కూడా కమిషనర్ పరిశీలించారు. అక్కడి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. గడువులోపల కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను పూర్తిచేయాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా చూడాలన్నారు. పనులు పూర్తయిన తరువాత ఖచ్చితంగా విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.