నాడు నేడు పనులు వేగవంతం చేయాలి..కలెక్టర్
Ens Balu
3
సింగుపురం
2020-09-04 21:23:26
శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం మండలం సింగుపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నాడు నేడు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నాడు నేడు పనులతో పాఠశాలల ముఖ చిత్రం మారుతుందని ఆయన పేర్కొన్నారు. మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని, కార్పొరేట్ స్ధాయిలో సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని ఆయన అన్నారు. తాగు నీరు, నిత్యం నీటిసరఫరాతో మరుగుదొడ్లు, మంచి విద్యుత్ దీపాలు, ప్యాన్ లు తదితర సౌకర్యాలు ఉండాలని చెప్పారు. విద్యార్ధులు ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అభ్యసించాలని, తద్వారా మంచి విద్యాభ్యాసం కలుగుతుందని, మానసిక వికాసం వస్తుందని కలెక్టర్ అన్నారు. సింగుపురం ప్రాథమిక పాఠశాల డెమో పాఠశాలగా రూపొందించడం వలన ఇతర పాఠశాలలను అభివృద్ధి పరచుటకు చక్కని వేదికగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, ఇడబ్య్లుఐడిసి కార్యనిర్వాహక ఇంజనీరు కె.భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.