నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతులు...
Ens Balu
2
Visakhapatnam
2020-09-05 11:12:19
విశాఖజిల్లాలో ఈరోజు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్రం వెలువరించిన 4.0 మార్గ దర్శకాలను అనుసరించి ఈ వెసులుబాటు కల్పించినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. వీకెండ్ కావడంతో విశాఖలోని పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకు లతో నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాంగంగా అరకులోని బొర్రాగుహలు, మ్యూజియం, పార్కు, కాఫీ సెంటర్, విశాఖలోని కైలాసగిరి, రోప్ వే, రుషి కొండ, కంబాల కొండ, టూరిజం మ్యూజియంతో అన్ని పర్యాటక ప్రాంతాలు తెరవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వ ఆదేశాలు రావడానికి వారం రోజుల ముందు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ పరిశుభ్రం చేయించారు అధికారులు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లించడంతోపాటు, అన్ని ప్రాంతాలను శానిటైజ్ చేశారు. అదే సమయంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు కూడా మాస్క్ ఖచ్చితంగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడలని కూడా పర్యాటక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా వుంటే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా పర్యాటక ప్రాంతాలకు పెద్దగా జనాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు..