విశాఖ మన్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలు భేఖాతరు..
Ens Balu
1
పాడేరు
2020-09-05 11:35:55
కేంద్రం ప్రభుత్వం బ్యాంకుల్లోని అన్నిరకాల రుణాలపై మారటోరియంపై తీర్పు ఇచ్చినప్పటికీ, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ విశాఖ ఏజెన్సీలో మాత్రం ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. కరోనా సమ యంలో అందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల వద్ద నుంచి బ్యాంకులు అన్ని రకాల లోన్లుకి ఈఎంఐలు కట్టించుకున్నాయి. అన్ని లోన్లకు ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్) ఉండటంతో జీతాలు పడిన వెంటనే లోన్లకు ఈఎంఐలు కట్ చేసుకున్నాయి. ఇవేవో ఆధారాలు లేకుండా అన్నమాటలు కాదు. విశాఖ ఏజెన్సీలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఖచ్చితంగా ఈఎంఐలు కట్టించుకున్నాయి. అవి వాస్తవమో కాదో ఏజెన్సీలోని 11 మండలాల్లోని బ్యాంకు నివేదికలు చూస్తే అర్ధమవుతుంది. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలలు సగం జీతం ఇచ్చిన సమయంలో కూడా బ్యాంకులు ఈఎంఐలు కట్టించుకోవడం కట్ చేసుకోవడం గమనార్హం. ప్రస్తుం సుప్రీం కోర్టు మరో రెండు నెలలు ఈఎంఐలపై గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈనెల అంటే ఆగస్టులో కూడా ఈఎంఐలు కట్టించుకున్నాయి ఏజెన్సీలోని బ్యాంకులు..అదేమంటే రుణాలకు ఈఎంఐలు ప్రతీనెలా కట్టాల్సిందేనని ఖరా ఖండీగా చెబుతున్నాయి. కొన్ని బ్యాంకులైతే ఈఎంఐ క్లియర్ అయ్యేంత వరకూ అకౌంట్లను ఫ్రీజ్ చేసి పెడుతున్నాయి. . అలాంటి సమయంలో కోర్టు తీర్పులను బ్యాంకులు ఎందుకు అమలు చేయడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం మారటోరియం ప్రకటించినా, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా బ్యాంకులు మాత్రం ఈ విధంగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంలో జిల్లా అధికారులు సైతం నోరు మెదపడం లేదు..