విశాఖలో స్టార్ట్...కెమెరా...యాక్షన్..


Ens Balu
3
R.k.Beach
2020-09-05 12:28:37

కరోనా వైరస్ నిభందనల తరువాత చాలాకాలానికి విశాఖలో సినిమా షూటింగ్ లు సందడి మొదలైంది. లాక్‌డౌన్‌ తరువాత 4.0 అన్ లాక్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారి నగరంలో సినిమా షూటింగ్‌ సందడి ప్రారంభమైంది. ఆర్కే బీచ్‌ రోడ్డులో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. కరోనా నేప థ్యంలో ఐదు నెలలుగా విశాఖలో సినీ షూటింగ్‌లు ఆగిపోయాయి. ప్రభుత్వ నిబంధనల సడలింపుల అనంతరం శనివారం బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ‘ఐపీఎల్‌’ పేరుతో రూపొందిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్‌ సభ్యులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్‌ జరిపారు. దీంతో విశాఖలో మళ్లీ షూటింగ్ సందడి నెలకొంది. ఇప్పటికే పలు హీరోల పెద్ద ప్రాజెక్టులు కూడా కరోనా కారణంగానే నిలిచిపోయాయి. ప్రభుత్వం షూటింగ్ లకు కూడా అనుమతులు ఇవ్వడంతో మళ్లీ వెండితెర పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని సినిమా దర్శకులు భావిస్తున్నారు.
సిఫార్సు