గురువులతోనే నవ సమాజ ప్రగతి..ఆచార్య ఎంవిఆర్ రాజు


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-05 13:03:45

ప్రపంచంలో గురు శిష్య అనుభంధం మానవ జాతికి శ్రీరామ రక్ష అని ఏయూ ఆచార్యులు కొనియాడారు. ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం విద్యార్థుల  ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు,ఈ సందర్బంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఆచార్యులు పూలమాలలు వేసి, అనంతరం గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం సైకాలజీ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం వి ఆర్ రాజు మాట్లాడుతూ,  గురువులతోనే నవసమాజ ప్రగతి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. విద్యతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేది గరువులు మాత్రమేనన్నారు. నిరంతరం ఏదో ఒకటి తాము నేర్చుకుంటూ  తమ విద్యార్థులకు కూడా  తెలియజేయాలని మంచి సంకల్పం ఒక్క గురువులకు మాత్రమే సొంతమన్నారు. నేటి ఆధునిక యుగంలో కూడా గురువుల జ్ఞానమార్గం ఎంతో మందిక విద్యార్ధులకు  ఆదర్శనీయమన్నారు. ప్రపంచాన్ని నడిపించేది గురు మార్గం ఒక్కటేనన్న ఆయన ఆంధ్ర యూనివర్సిటీ లోడాక్టర్  సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలు మరపురానివన్నారు.  ప్రస్తుతం  తెలుగుభాషను కొనసాగిస్తూనే మరోవైపు ఇంగ్లీషుభాషపై కూడా విద్యార్ధులు పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుప్రాయం నుంచి ఇంగ్లీష్ పై పట్టు సాధిస్తే అది భవిష్యత్ తరాలకు పునాది వేస్తుంది అన్నారు. తదుపరి సైకాలజీ విభాగం అధ్యాపకులు డాక్టర్ సునీత, సుభాషిని, తదితరులును విద్యార్డులు ఘనంగా  సత్కరించారు. ఏయూ సైకాలజీ సీనియర్  విభాగం విద్యార్థి,  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వేణు, కృష్ణ,దివిజ,కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు