రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీకి ఆగస్టు 20 ఆఖరు..
Ens Balu
2
Visakhapatnam
2021-08-13 15:57:03
కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులంతా కచ్చితంగా ఈ-కేవైసీ చేయించుకోవాలని విశాఖ అర్భన్ తహశీల్దార్ కుంచే జ్నానవేణి స్పష్టం చేశారు. ఈమేరకు విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. అర్భన్ మండలం పరిధిలో రేషన్ షాపులో కార్డు కలిగి కుటుబంలో ఒక్కరైనా ఈ-కేవైసీ చేయించుకోకపోతే కార్డులో సభ్యుల పేర్లు తొలగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా కార్డుకూడా రద్దుచేస్తామని చెప్పారు. కార్డు ఈ-కేవైసీ చేయించుకునేందుకు గ్రామరెవెన్యూ అధికారి, వాలెంటీర్లను సంప్రదించాలని ఆమె సూచించారు. ఈనెల 20తేదీ ఈ-కేవైసీకి ఆఖరుతేదీగా నిర్ణయించారని తహశీల్దార్ పేర్కొన్నారు. అంతేకాకుండా సదరు రేషన్ కార్డులో తప్పుగా ఆధార్ నమోదు అయిఉన్నా వాటిని సరిచేయించుకోవాలని సూచించారు. వాటిని గ్రామ సచివాలయ రైస్ కార్డు సేవల ద్వారా ఆధార్ కార్డు నెంబరు మార్చుకొనుటకు అవకాశం కల్పించినట్టు తెలియజేశారు. చిన్న పిల్లల ఈ-కేవైసీ నమోదుకు ముందుగా ఆధార్ కార్డులో వారి వేలిముద్ర నవీకరణ (అప్డేట్) కూడా చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం పేర్కొన్న హెచ్చరికల ద్వారా సంబదిత సభ్యుల నమోదు ప్రక్రియ చేయించుకోని రేషన్ కార్డులను, కార్డు దారులను బోగస్ సభ్యులుగా గుర్తించి వారి యొక్క పేర్లను రైస్ కార్డు నుంచి తొలగిస్తామని ఆమె తెలియజేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ నెల నుంచి నిత్యవసర సరుకులు సరఫాను నిలిపివేస్తామని చెప్పారు. వాలెంటీర్లు అందరూ వారి పరిధిలో గల కుటుంభ సభ్యుల యొక్క ఈ-కేవైసీ చేయించుకొనని సభ్యులచేత ఆగస్టు 20 లోగా విధిగా ఈ-కేవైసీ చేయించాలని వీఆర్వోలకి ఆదేశాలు జారీచేశామని తహశీల్దార్ జ్నానవేణి స్పష్టం చేశారు.