బెస్ట్ ఆఫీసర్ గా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి..


Ens Balu
2
విజయనగరం
2021-08-15 14:30:43

చక్కని  విధినిర్వహణ ఆ అధికారిణి పరమావధి.. మత్స్యశాఖలో ఏ కొత్త ప్రాజెక్టు మొదలైనా దానిని ఈమె మాత్రమే రాష్ట్రంలో విజయవంతంగా మొదటిసారిగా పూర్తిచేస్తారు.. అధికారులు ఇచ్చిన లక్ష్యాలను ఇట్టే పూర్తిచేయడంతో ఈ అధికారిణి దిట్ట.. ఏజిల్లాలో పనిచేసినా ఆమెను బెస్ట్ ఆఫీసర్ అవార్డు వరిస్తుందటే అతిశయోక్తి కాదేమో.. ఆమె విజయనగరం జిల్లా మత్స్యశాఖ అదనపు సంచాలకులు నేతల నిర్మల కుమారి. పేరుకి జిల్లా అధికారిణి అయినప్పటికీ మత్స్యశాఖలో అన్ని పనులను ఎంతో ఉన్నతంగా చేసుకుపోతుంటారీమే. తెలుగుదనం ఉట్టిపడేలా చక్కని రూపంతో వ్యవహరిక శైలి.. టీమ్ ని లీడ్ చేయడంలోనూ అంతే నేర్పుగా వ్యవహరించే సమసర్ధత ఆమె సొంతం. వెరసీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారిణగా డిప్యూటీసీఎం పాముల పుష్పవాణి నుంచి అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈమెను అభినందిస్తూ..ప్రభుత్వానికి, మత్స్యశాఖకు మరింత పేరుతీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏడి నిర్మల కుమారి మీడియాతో మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత భాద్యతను పెంచిందన్నారు. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పర్యవేక్షణలో విధినిర్వహణ మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తానని, కొత్త ప్రాజెక్టులను మత్స్యకారులకు చేరువ చేయడంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.  ఈమెకి అవార్డు రావడం పట్ల జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.