పీహెచ్సీల్లో ప్రసవాలు అధికంగా చేయాలి...కలెక్టర్


Ens Balu
4
Acchutapuram
2020-09-05 18:35:52

ప్రాధమిక వైద్యకేంద్రాల పరిధిలో ప్రసవాలు అధికంగా చేయడానికి పారామెడికల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వైద్యా ధికారులను ఆదేశించారు. శనివారం అచ్చుతాపురంలో మండలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా  గ్రామంలో గల  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని  సందర్శించి రోజుకు ఎన్ని శ్యాంపిల్స్ తీస్తున్నారని, ఎన్ని  కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.  పి.హెచ్.సి.లో గల ల్యాబ్, ఫార్మశీని పరిశీలించారు.  ఫార్మశీ లో గల మందుల వివరాలు, స్టాక్ ఎంత ఉన్నదీ, రిజిస్టర్ సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదాఅని రిజిస్టర్ను పరిశీలించారు.  ల్యాబ్ ను పరిశీలించి అందులో కొన్ని పరికరాలు మరమ్మత్తులకు గురైనవని, అవసరమైన పరికరాల జాబితా పంపాలని డా. రజనిని ఆదేశించారు. పి.హెచ్.సి.లో ప్రసవాలు ఎన్ని జరిగాయని, సౌకర్యాలు అన్ని ఉన్నాయని, ప్రసవాలు తగ్గకూడదని డాక్టర్ ను ఆదేశించారు. పి.హెచ్.సి.లో లైటింగ్, పెయింటింగ్, తదితరమైనవి వారం రోజుల్లో రూపు రేఖలు మారిపోవాలని ఆదేశించారు.  ఆ బాధ్యతను అనకాపల్లి ఆర్డీఓ సీతారామరావుకు అప్పగించారు.  కొండకర్ల ఆవ ను సందర్శించారు.  పర్యాటకులు వస్తున్నది లేనిది తహసిల్థార్ ను అడిగి తెలుసుకున్నారు.  అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఆహాలదంగా తయారు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పర్యాటకులు సందర్శించే విధంగా ఉండాలని, సైనేజస్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.