81తమిళ మద్యం సీజ్.. ముగ్గురు అరెస్ట్..సిఐ ప్రసాద్


Ens Balu
2
Sullurupeta
2020-09-05 18:41:47

అక్రమద్యం తరలింపు వ్యాపారం ఎవరు చేసినా  కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూళ్లురుపేట సిఐ ఆర్యూవిఎస్ ప్రసాద్  అన్నారు.ఈ మేరకు తన బ్రుందాలతో అక్రమ తమిళ మద్యంపై దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శనివారం తడ బస్టాండు నుంచి తమిళ మద్యం ఎస్ కే సాదిక్ భాషా నుండి  తమిళ మద్యం బాటిళ్లను 20 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కారిపాకం గ్రామానికి చెందిన  రాసగొల్ల నాగేంద్రబాబు  అనే  నిందితుని అదుపులోకి తీసుకొని అతని వద్ద  20 అక్రమ తమిళ మద్యం  బాటిళ్లను స్వాధీనపర్చుకున్నారు. ఎస్ కె  సాదిక్ అనే వ్యక్తి నుండి 41 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 81 బాటిళ్లు వీరి నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూళ్లూరుపేట  సి ఐ తో పాటు  హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, హరిబాబు వెంకటేశ్వర్లు వెంకటసుబ్బయ్య లు పాల్గొన్నారు.