కొటియాలో అభివ్రుద్ధి కార్యక్రమాలు జరగాలి..
Ens Balu
4
Vizianagaram
2021-08-23 11:35:39
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన కొటియా గ్రామం లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి తెలిపారు. సోమవారం స్పందన అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ సంయుక్త కలెక్టర్ రెవిన్యూ వారు త్వరలో కొటియా పై పార్వతి పురం లో డివిజినల్, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారని, అన్ని శాఖల అధికారులు హాజరై కోటియా అభివృద్ధి కి చేయవలసిన పనుల పై సమీక్షించుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం పై, సీజనల్ వ్యాధుల పై, వాక్సినేషన్ , తదితర అంశాల పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని చేయాలనీ సూచించారు.