రహీమున్నీసాకు మరో అరుదైన అవకాశం..
Ens Balu
2
Visakhapatnam
2021-08-23 13:25:56
విశాఖకి చెందిన ప్రముఖ సామాజిక వేత్త, న్యాయవాధి రహీమున్నీసాకు మరో అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ విభాగంలో నడుస్తున్న ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) సంస్థ ఈ నెల 25న ఇంటర్నిషిప్ డే పేరిట ఒక ఆన్ లైన్ కార్యక్రమం నిర్వస్తోంది..ఈ సందర్భంగా జరగనున్న ప్రత్యేక వెబినార్ లో ఆమె పాల్గొనాలని ఆహ్వానం పంపింది. సుమారు ఆరు లక్షల మందికి పైగా ఇంటర్న్ షిప్ కలిగి ఉన్న సాంకేతిక విద్యా విభాగానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆన్ లైన్ లో చర్చించాలని కోరింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా నియమితులైన బుద్ధ చంద్రశేఖర్ సలహా..సూచనల మేరకు ఆమె కూడా ఆ వెబినార్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏఐసీటీఈ నిర్వహించే ఇంటర్న్ షిప్ డే లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు తాను గర్వపడుతున్నానని రహీమున్నీసా మీడియాకి తెలియజేశారు. అతికొద్ది మందికి వచ్చే ఈ అవకాశం విశాఖజిల్లా న్యాయవాదికి దక్కడం పట్ల సహచర న్యయవాదులు, సామాజిక వేత్త హర్షం వ్యక్తం చేశారు.