శ్రీకాకుళం జిల్లాలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఎరువుల షాపుల యాజమాన్యాలను హెచ్చరించారు. ఎరువుల షాపుల యాజమానులతో ఎరువుల ధరలపై జిల్లా లోని హోల్ సేల్ డీలర్లు, కంపెనీ తయారీ దారులు, రిటైల్ డీలర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు సరసమైన ధరలకే విక్రయించాలని పేర్కొన్నారు. ఎరువులు తప్పని సరిగా ఎంఆర్ పి రేట్లకే అమ్మాలని, ఎరువులను తప్పని సరిగా బయోమెట్రిక్ విధానంలో రైతులకు మాత్రమే అమ్మకాలు జరగాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగకూడదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల యజమానుల సమస్యలను జెసి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో జెడి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.