సుడా ప్లానింగ్ అధికారిగా శోభన్ బాబు..


Ens Balu
4
Srikakulam
2021-08-24 14:26:26

శ్రీకాకుళం నగర అభివృద్ధి సంస్థ  (సుడా) ప్రణాళిక అధికారిగా వి.శోభన్ బాబు నియమితులయ్యారు. మంగళవారం సుడా ప్రణాళిక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్,  ఇతర అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి సుడా చక్కని ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నగర అభివృద్ధికి కీలకపాత్ర ప్రణాళికలని, పారదర్శకంగా,  భవిష్యత్తు అవసరాలకు హేతుబద్దంగా ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు.