న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ వేయించాలి..
Ens Balu
2
Srikakulam
2021-08-25 13:28:02
న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బలగ సచివాలయం వద్ద న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చిన్నపిల్లలకు వేయిస్తే భవిష్యత్ లో శ్వాసకోశ సంబంధ వ్యాదులు, కోవిడ్ నివారణకు ఉపయోగపడుతుందన్నారు. న్యూమోనియా అనే వ్యాధి స్ట్రెప్టోకోకస్ అనే బాక్టీరియా వలన వస్తుందని, దీని వలన సుమారు 12,700 మంది 5 సంవత్సరములు లోపు గల పిల్లలు మరణించినట్లు చెప్పారు. మొదటి డోసు 6 వారాలకు, రెండవ డోసు 14 వారములకు మరియు బూస్టర్ డోసు 9 నెలలకు వేయాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ భారత దేశ ప్రభుత్వం జాతీయ వ్యాది నిరోధక కార్యక్రమములో చేర్చినట్లు చెప్పారు. వ్యాక్సిన్ వేసిన చిన్న పిల్లల తల్లిదండ్రులు తెలిసిన వారి తల్లులకు వ్యాక్సిన్ పిల్లలకు వేయించాలని చెప్పాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగానే వేస్తారని తెలిపారు. జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రనాయక్, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి అప్పారావు, మున్సిపల్ కమీషనర్ ఓబులేసు, వైద్యాధికారి కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.