ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి కోవిడ్-19 వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్), ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, వై.ఎస్.ఆర్ (అర్బన్ హెల్త్) క్లినిక్ లు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పురోగతి, అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, అగ్రికల్చర్ ఖరీఫ్ ఈ క్రాప్, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం భూ సర్వే తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పక్కాగా జరగాలని, కోవిడ్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలన్నారు. సరఫరా చేస్తున్న తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామ సచివాలయాల భవనాలు, గ్రామంలో ఇంగ్లీషు మీడియం స్కూల్, ఆర్బికె, డిజిటల్ లైబ్రరీ, ఎఎంసి, బిఎంసి, తదితర వాటిద్వారా గ్రామాలు రూపురేఖలు మారాలని చెప్పారు. సచివాలయాల భవనాలు నిర్మాణాలపై దృష్టి సారించాలని, అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల పైన ప్రత్యేక దృష్టి సారించి డిశంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
బల్క్ మిల్క్ మొదటి దశలో భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్మాణాలు పూర్తి చేసి రెవెన్యూ గ్రామాల్లో 31 డిశంబరు నాటికి ఇంటర్ నెట్ పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పారు. డిజిటల్ లైబ్రరీ లు నిర్మాణాలకు భూ కేటాంపు చేయాలని, ఆగస్టు చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభం కావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్లు, జెసిలు, ఐటిడిఎ పిఓ, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సందర్శించి పనితీరును పరిశీలించాలన్నారు.
సచివాలయాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి చార్ట్ ను డిసిప్లే చేస్తున్నారా లేదా, సిబ్బంది బయోమెట్రిక్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది విధులు నిర్వహణపైన పరిశీలించాలన్నారు. రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కార్డు లు అర్హతను చూసి మూడు నెలల్లో మంజూరు చేయాలని చెప్పారు. ఇవి సంవత్సరానికి నాలుగు సార్లు మంజూరు చేయాలని తెలిపారు. గృహ నిర్మాణాలపైన ధరఖాస్తులు వస్తే వాటిపై విచారణ చేసి అర్హులైతేనే మంజూరు చేయాలన్నారు. సంవత్సరానికి రెండు సార్లు మంజూరు చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమచేసేందుకు ముందు రోజు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది గ్రామ వార్డు ల్లో ప్రజలకు ఖచ్చితంగా అవగాహన పరచాలన్నారు.
వైయస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం పనులు ప్రారంభించి డిశంబరు నాటికి పూర్తి చేయాలని చెప్పారు. ఇళ్ల స్థల పట్టాలు కోసం వచ్చిన దరఖాస్తులను అర్హత చూసుకుని 90 రోజుల్లో మంజూరు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పట్టాల జాబితాను తెలియజేయాలని పేర్కొన్నారు.
ఇ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అగ్రికల్చర్ అడ్వయిజర్ కమిటీ సమావేశాలను ప్రతీ నెల ఆర్బికె స్థాయిలో నెలలో మొదటి శుక్రవారం, మండల స్థాయిలో రెండవ శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడవ శుక్రవారం అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆర్బికెలోఔ విక్రయించే ఎరువులు నాణ్యమైనవిగా ఉండాలని పేర్కొన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం లో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండాలన్నారు. తదితర అంశాలు పై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాకలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ శ్రీనివాసులు, శ్రీరాములు నాయుడు, డ్వామా పీడీ కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.