ప్రత్యేక కోవిడ్ డ్రైవ్ విజయవంతం కావాలి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-08-27 13:38:54

విశాఖ జిల్లా, నగరంలో ఈ నెల 28,31, తేదీలలో  18-44 సంవత్సరాల వయస్సుగల ప్రతి ఒక్కరికి ప్రత్యేక  కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద  జిల్లా వ్యాప్తంగా  అన్ని పి.హెచ్.సి., సి.హెచ్.సిలలో మొదటి  డోస్ ప్రక్రియ శాచ్యురేషన్ మోడ్ లో నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులను ఆదేశించారు.  శుక్రవారం వి.ఎం .ఆర్ .డి.ఎ., చిల్డ్రన్ ఎరినాలో   జిల్లా స్థాయి వైద్యాధికారులు సమావేశాన్ని నిర్వహించారు.  
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఉత్తర్వలను జారీ చేసిందన్నారు. జిల్లాలో 18-44 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ కు  1లక్ష 60వేల వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులో ఉన్నాయన్నారు.  గ్రామీణ మరియు పట్టణ సచివాలయ పరిధిలో సిబ్బంది ప్రత్యక శ్రద్ద వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.  నేడు శుక్రవారం 45 సంవత్సరాలు పై బడిన వారికి  2వ డోస్ వేయాలన్నారు.  3rd వేవ్ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక వసతుల కల్పన, బెడ్స్, అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లలను సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేటు గత నెలలో 2.4 శాతం నమోధైందన్నారు.  ఒక్క డెత్ కూడా రాకుండా చూడాలన్నారు.  ప్రతి ఒక్కరూ ఎస్.ఎం.ఎస్. ప్రోటోకాల్ నిబంధనలను పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని, ఉల్లంషిుంచిన వారిపై పోలీసు ఫైన్ వేయాలన్నారు.
ఏజెన్సీ మండలాలలో ప్రజలు దోమ తెరలను సక్రమంగా వాడుకొనే విదంగా అవగాహన కల్పించాలన్నారు. పాడేరు, అరుకు ప్రాంతీయ ఆసుపత్రులలో  సర్జరీల నిర్వాహణకు సంబందించి మౌళిక వసతుల కల్పన వేగవంతం చేయాలని ఐ.టి.డి.ఎ., పిఓ రోణంకి గోపాలకృష్ణకు సూచించారు . పి.హెచ్.సి.లలో డెలివరీ కేసులను వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ కింద నమోదు చేయాలన్నారు.  తల్లి సురక్షా పథకం కింద  పేషెంటు డేటాను ఆరోగ్య మిత్రలో  లాగిన్ చేసి కేస్షీట్, డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలన్నారు.  వై.ఎస్.ఆర్.ఆరోగ్య ఆసరా కింద  పోస్టు డిస్చార్జ్ పేషెంటుకు  ఇన్ సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ అప్లోడ్ కు సంబందించి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు.  సీజనల్ వ్యాధులకు సంబందించి నెలలో ఒక సారి వైద్యాధికారులకు వెబ్ నార్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ఎ.ఎం.సి ప్రిన్సిపాల్  డా. సుధాకర్ కు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  నిర్వహించే స్పందన  వీడియో కాన్పరెన్స్ లో వైద్య, ఆరోగ్యానికి  అధిక ప్రాముఖ్యత కల్పిస్తున్నారని  రానున్న 90 రోజుల్లో  వైద్య శాఖలో  ఉన్న ఖాళీలను  భర్తీ  చేయనున్నారని  ఖాళీల వివరాల డేటా ను  ప్రభుత్వానికి  పంపించాలని  డి .ఎం .హెచ్.ఓ ను ఆదేశించారు.
 
జి.వి.ఎం.సి కమిషనర్ జి.సృజన మాట్లాడుతూ  జి.వి.ఎం.సి పరిధిలో మలేరియా హట్ స్పాట్ ఏరియాలను గుర్తించి  నిల్వనీరు లేకుండా ఇంటి పరిసరాలలో పారిశుధ్యం నిర్వహించడం తో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించడం జరుగుతుందని  తెలిపారు.  ప్లేట్ లెట్స్ అవసరం అవుతున్నందున బ్లెడ్ డోనేషన్ క్యాంపులను  నిర్వహించడానికి వైద్యాధికారులు   ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ  పి.హెచ్.సిలను తనిఖీలు చేయడం జరుగుతుందని, వ్యాక్సిన్ రాగానే ఏజెన్సీకి పంపించడం జరుగు తుందన్నారు.  వైద్యాధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారన్నారు. 

ఐ.టి.డి.ఎ. పిఓ రోణంకి  గోపాలకృష్ణ మాట్లాడుతూ  ఏజెన్సీ ఏరియాలో  2లక్షల 10వేల కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్ లను వేయడం జరిగిందన్నారు.  3RD  వేవ్ దృష్టిలో పెట్టుకొని  అన్ని పి.హెచ్.సిలలో  బెడ్స్, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ లను సిద్దం చేసుకోవడం జరిగిందన్నారు.  ఆసుపత్రులలో సర్జరీల ఏర్పాటు కు సంబందించి పనులను  ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు.  ఏజెన్సీ ఆసుపత్రులలో పని చేయుటకు కాంట్రాక్ట్ బేసిస్ మీద  పి జి. డాక్టర్లు పీడియాట్రీషియన్స్, ఎనస్తిషియన్ ,గైనిక్ డాక్టర్లకు  ప్రత్యే ఎలవెన్స్ తో  భర్తీ చేయడానికి నోటిఫికేషన్  ఇవ్వనున్నామన్నారు.  ఈ సమావేశంలో  జిల్లా వైద్యాధికారి డా.సూర్యనారాయణ,  ఎ .ఎం .సి ప్రిన్సపాల్ డా.సుధాకర్, డి.సి.హెచ్.ఎస్. డా. ప్రకాషరావు, వైద్యాధికారులు హాజరయ్యారు.