అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు..


Ens Balu
4
Srikakulam
2021-08-27 14:11:49

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.  శుక్రవారం కంపోస్టు కాలనీ వద్ద సిటిజన్ అవుట్ రిచ్ కాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. శ్రీనివాసులు, కళింగ వైశ్య, కాపు కార్పొరేషన్ల అధ్యక్షులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లో నెలలో 4వ శుక్ర, శనివారాలలో సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలకు ఇంటింటికి వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది వెళ్లి ప్రభుత్వ పథకాలు గూర్చి తెలియ జేస్తారని చెప్పారు.  గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా పరిపాలన నడుస్తోందన్నారు. గతంలో ఏనాడు జరగని విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని చెప్పారు.  సచివాలయాల పరిధిలోని సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ, ఇతర కులాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్ లలో పేద వారు చదవలేరని, వారికి కోసం ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.  కరోనాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, దిశ చట్టం ప్రవేశ పెట్టి మహిళలకు రక్షణ కల్పించినట్లు చెప్పారు.  అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.  అధికారం చేపట్టిన వెంటనే ఏ విధమైన సిఫార్సులు లేకుండా పారదర్శంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించడమైనదని తెలిపారు. 

          జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివిధ సర్వీసులను అందిస్తున్నట్లు చెప్పారు.  గతంలో ఒక పథకం కోసం కలెక్టర్ కు, మున్సిపాలిటీలకు ధరఖాస్తు పెట్టుకొని, అది ఏమైందో తెలుసుకొనేవారన్నారు.  ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఉందుబాటులో ఉందని, ఆ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  గ్రామ/వార్డు సచివాలయాల్లో అన్ని శాఖలకు సంబంధించిన వారు ఒకరు ఉంటారని చెప్పారు.  ఆ శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాల సమాచారంను తెలియజేస్తారని, అర్హులైన లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో బయటే డిసిప్లే చేస్తారని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు రాకుంటే వారు దరఖాస్తు చేసుకుంటే పథకం వస్తుందని తెలిపారు.  ప్రజలంతా ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కావాలన్నారు. సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ నగరాలు / పట్టణాలలో సచివాలయాల ద్వారా అందిస్తున్న సర్వీసులు సిబ్బంది తెలియజేస్తారన్నారు.  ప్రతి నెల 4వ శుక్ర, శనివారాలలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గూర్చి సచివాలయాల సిబ్బంది తెలియజేస్తారని చెప్పారు.  అనంతరం ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ పథకం వస్తుందో తెలియజేసే కేలండర్ ను ఆవిష్కరించారు.  అంతకు ముందు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఎం.వి. పద్మావతి, కమీషనర్ ఓబులేసు, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.