చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం..


Ens Balu
3
Srikakulam
2021-08-27 14:14:59

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు.  శుక్రవారం వైశ్యరాజు కళ్యాణ మండపంలో 27 నుండి  29వ తేదీ వరకు ఏర్పాటు చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రారంభించారు.  చేనేత కార్మికులకు సహాయ పడాలని చెప్పారు.  ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల సానుకూలంగా ఉందన్నారు.  కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు.  తెలంగాణాలోని సిరిసల్ల వెళ్లి చేనేత కార్మికుల సమస్యలు ఏవేవి ఉన్నాయో తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.  చేనేత కార్మికులకు మెరుగైన సేవలు అందించించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదన్నారు.  ప్రతి సోమవారంలో ఒక సోమవారం చేనేత వస్ర్తాలు ధరించడానికి జిల్లా కలెక్టర్ చెప్పినట్లు తాను కూడ ధరిస్తానని, తన మిత్రులు చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.  నెలలో మొదటి సోమవారం జిల్లా అధికారులు చేనేత వస్త్రాలను ధరించాలని ఉత్తర్వవులు జారీ చేసినట్లు వెల్లడించారు.  చేనేత కార్మికులు అందరూ సమన్వయంతో, ఒకరితో ఒకరి సహాయ సహకారాలు అందించుకోవాలన్నారు.  జిల్లాలో తయారు చేస్తున్న వస్త్రాలకు మార్కెటింగ్ చేస్తే మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పారు. మార్కెటింగ్ పై దృష్టి సారించాలని చెప్పారు.

          కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులను గుర్తించి ప్రభుత్వం అవార్డులతో పాటు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు.  చేనేత కార్మికులు మాట్లాడుతూ నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, ఇంత వరకు 72 వేల రూపాయలు వచ్చినట్లు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.  అంతకు ముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను పరిశీలించారు. బిసి సంక్షేమం కార్యనిర్వాహక అధికారి రాజారావు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు