ఆర్.బి.కె ల ద్వారా 32 శాతం విక్రయాలు..


Ens Balu
2
Srikakulam
2021-08-27 14:30:05

శ్రీకాకుళం జిల్లాలోని 820 రైతు భరోసా  కేంద్రాల ద్వారా ఆ గ్రామ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేశారు.జిల్లాలో ఇప్పటి వరకు 713 రైతు భరోసా కేంద్రాల ద్వారా 6,570 టన్నులు యూరియా, 2,341 టన్నుల డి.ఏ.పి, 54 టన్నులు పొటాష్ ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లావ్యాప్తంగా విక్రయాలలో 30% ఎరువులు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందించవలసి ఉందని అన్నారు. కాని ఇప్పటివరకు జిల్లాలో 21,985 మెట్రిక్ టన్నులు గాను 8,971 మెట్రిక్ టన్నులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేసి విక్రయాల్లో 32% లక్ష్యాలను సాదించడం జరిగిందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. కావున శుక్రవారం వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.