సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి.


Ens Balu
4
Visakhapatnam
2021-08-27 15:30:04

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా పై వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, మలేరియా సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి. సృజన  ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాదికారులతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ , దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ జరపాలని, ప్రతీ రోజు జోనల్ స్థాయిలో అధికారులు వార్డులలో సందర్శించి, ప్రతీ శుక్రవారం “డ్రై డే” పాటించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వంనూతనంగా ప్రవేశపెట్టిన “సిటిజన్ అవుట్ రీచ్” కార్యక్రమంను పెద్దఎత్తున ప్రచారం చేసి, అందులో అమలవుతున్న 543 సేవలు, ప్రభుత్వం చేపడుతున్న పధకాల గూర్చి ప్రజలకు వివరించాలని, అందుకొరకు అధికారులు ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. శనివారం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ లో ఒక లక్ష వ్యాక్సినేషన్లు వేయించాలని, అందుకు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాదికారులు, కార్యదర్శులు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, లక్ష్యాన్ని పూర్తీ చేయాలని, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి 18 సం. ల పైబడిన వారికందరికీ కోవేగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ కొరకు వ్యాక్సినేషన్ వేయు సెంటర్లకు తీసుకొచ్చి వేయించాలని ఆదేశించారు.