పాలిసేట్ -2021 ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 1న తిరుపతిలో 6 కేంద్రాలు 2692మంది హాజరు కానున్నారని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని తిరుపతి ఆర్ డి ఓ వి. కనకనరసా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక ఆర్. డి. ఓ. కార్యాలయంలో పాలిసేట్ -2021 నిర్వహణ పై సంబంధిత అధికారులతో అర్దిఒ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆర్. డి. ఓ. మాట్లాడుతూ ప్రవేశ పరీక్ష ను సమర్థవంతంగా నిర్వహించాలని పొరపాట్లకు తావివ్వరాదని అన్నారు. పరీక్షా సమయం ఉదయం 11.00 నుండి మ. 1.00 వరకు ఉంటుందని, గంట ముందే పరీక్షా కేంద్రాలలోకి అభ్యర్థుల అనుమతి ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరగు విద్యార్థులు హెచ్. పి. పెన్సిల్, పెన్, ఎరేజర్ మినహా ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి ఉండదని సూచించారు. పరీక్షా సమయంలో విద్యుత్ శాఖ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, నగరపాలక సంస్థ, త్రాగు నీరు, పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్ర్రతి విద్యార్థి మాస్కు తప్పనిసరి అని, వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ 19 నిబంధనలు పాటించి పర్యవేక్షించాలని సూచించారు. అభ్యర్థుల సందేహాలకు హెల్ప్ డెస్క్ 9985129995 సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ఈ సమీక్ష లో పద్మారావు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ టెక్నికల్ ఎడుకేషన్, అబ్జర్వర్లు నరసింహా రెడ్డి, శివప్రసాద్, ఫ్లయింగ్ స్క్వాడ్ గా వ్యవహరించనున్న యుగంధర్, ఆర్ టి సి, పోలీస్, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి పరీక్షా కేంద్రాలివే.. 1. శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పి. జి. కాలేజి , 2. ఎస్. వి. ఆర్ట్స్ కాలేజి, 3. ఎస్. వి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ( టి టి డి ఏడి బిల్డింగ్ ఎదురుగా), 4. ఎస్. జి. ఎస్. ఉన్నత పాటశాల ( టి టి డి ఏడి బిల్డింగ్ ఎదురుగా) , 5. ఎస్. వి. జూనియర్ కాలేజి 6. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలు పరీక్షా కేంద్రాలు గా వున్నాయి.