అభిప్రాయ సేకరణకు అందరూ ఆహ్వానితులే..
Ens Balu
11
Srikakulam
2021-08-28 16:18:34
నూతన యువజన విధానాన్ని రూపొందించేందు యువత సమగ్ర అభివృద్థికి అవసరమైన రాష్ట్ర స్థాయి యువజన విధానమును (స్టేట్ యూత్ పాలసీ) రూపొందించుటకు సూచనలు, సలహాలు తెలియజేయాలని సెట్ శ్రీ, ముఖ్య కార్య నిర్వహణాధికారి కె. సూర్యప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. యువజన సర్వీసుల శాఖ, కమీషనర్ సి. నాగమణి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశములపై స్టేట్ యూత్ పాలసీ రూపొందించుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని యుతి, యువకులకు అవసరమైన విద్య, ఉపాధి మరియు ఉద్యోగ కల్పనకు అవసరమైన ఒక సమగ్ర రోడ్డు మ్యాప్ తయారు చేయుటకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సూచనలు, సలహాలను ఆహ్వానించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో సదరు సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను స్వీకరించుటకు ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజా వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజావేకకు జిల్లాలో గల మేధాులు, యువజన సంఘ సభ్యులు, ఎన్.జి.ఓ. ప్రతినిధులు, CII,FICCI యువజన పారిశ్రామిక వేత్తలు, విద్యా వేత్తలు, సామాజిక సేవా కార్యకర్తలు, జాతీయ యుజన అవార్డు గ్రహీతలు, తదితరులు వారి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలతో వ్రాత పూర్వక కాపీలతో హాజరు కావలసినదిగా కోరియున్నారు. ముఖ్యముగా వారి సూచనలు, సలహాలు యువతకు సంబంధించి విద్య, ఉపాధి మరియు ఉద్యోగ కల్పనకు అనుగుణంగా తయారుచేయవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు. ఈ కార్యాక్రమమునకు అందరు ఆహ్వానితులేనని తెలిపారు. ఇతర వివరముల కొరకు బి.వి.ప్రసాద్ రావు, మేనేజరు, సెట్ శ్రీ శ్రీకాకుళము వారి సెల్ నెం.8341478815 ను సంప్రందించవలసినదిగా ఆ ప్రకటనలో తెలిపారు.