అగ్నికి ఆహుతైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి రథం


Ens Balu
3
Antervedi Pallipalem
2020-09-06 12:34:15

తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిలో వేంచేసియున్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దగ్దమైంది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో చోటు చేసుకుంది. షెడ్డులో ప్రత్యేకంగా భద్రపరిచిన రథం ప్రాంగణ నుంచి తీవ్రమైన మంటలు రావడంతో ప్రమాదవశాత్తు జరిగిందా, లేక విద్రోహుల దుశ్చర్యా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామస్తులు మాత్రం ఇది దుశ్చర్య అని,గత ఆరు నెలలుగా సి సి టి వి కెమెరాలు పనిచేయకపోయినా ఎందుకు మరమ్మత్తు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా 40 అడుగులు ఎత్తు ఉన్న ఈ రథాన్ని 62 ఏళ్ల క్రితం పూర్తీగా టేకు కలపతో ఆగమ శాస్త్ర ప్రకారం తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు.ఈ రధోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సత్వర విచారణ జరుగుతోంది..
సిఫార్సు