లోకానికి పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడే..
Ens Balu
6
విశాఖసిటీ
2021-08-30 06:33:09
మహా విశాఖ ఓల్డ్ సిటీలోని శ్రీ వివేకానంద వృద్ధుల, అనాధ ఆశ్రమం లో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ భగవానుడు, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వివిధ పూజలు అనంతరం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తొలి పూజలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు విశేష పూజాది కార్యక్రమాలు,భజనలతో పూర్తిచేశారు.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంస్థ సభ్యులు,వృద్ధులు,భక్తులు పాల్గొని శ్రీ కృష్ణ భగవానుడి సేవలో తరించారు. తొలుత ఆశ్రమం కు చెందిన గోమాతకు సభ్యులందరూ విశేష పూజలు జరిపారు. గోమాతను అందంగా అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, లోకానికి పరమాత్ముడు ఆ కృష్ణ భగవానుడు ఒక్కరే అన్నారు. సర్వ మానవాళిని రక్షించేది ఆయనే అని కృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు. సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ, ప్రతి ప్రతియేటా అన్ని పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధులూ,అనాధలకు తమ ఇళ్ళకు దూరంగా ఉన్నామన్న భావన రాకుండా ఉండాలనే ఆయా పండుగలు జరుపుతామన్నారు. మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశేష సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. అందరు ఆరోగ్యం గా ఉండాలని పలు పూజలు చేపడతామన్నారు. సంస్థ సభ్యులు తో పాటు బండారు గజపతి స్వామి,శీరం శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.