తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా సఖినేటి పల్లిలో అత్యధికంగా 38.2 మిల్లీమీటర్లు వర్షపాతం, అత్యల్ఫంగా ఎటపాకలో 0.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని కాకినాడ కలెక్టర్ కార్యాలయం తెలియజేసింది. సోమవారం కాకినాడలో ఈ మేరకు మీడియాకి ప్రకటనల విడుదల చేసింది. జిల్లాలో 64 మండలాల పరిధిలో మొత్తం 147.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, ఏవరేజిన 2.3మిల్లీ మీటర్లు వర్షపాతంగా ఉందని అందులో పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకటించినట్టుగా కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో సాధారణ వర్షం మాత్రమే నమోదు కావడం విశేషం.