ఆత్మరక్షణకు దిశయాప్ రక్షణ కవచం..
Ens Balu
4
Srikakulam
2021-08-30 08:46:36
ఆత్మరక్షణే ఆయుధమని, చట్టం ప్రతి మహిళకు రక్షణ కవచం వంటిదని వక్తలు అభిప్రాయపడ్డారు. శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ (సేవ), శ్రీప్రగతి మహిళా మండలి కుటుంబ సలహా కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన " లైంగిక వేధింపులు-మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహనా సదస్సుకు సేవ అధ్యక్షురాలు పైడి రజని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఎస్ఐ ఎం.ప్రవల్లిక మాట్లాడుతూ, చదువుకొనే బాలికలు, వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు తరచూ వేధింపులకు గురవుతూనే ఉన్నారని, వీరంతా చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. వక్తగా హాజరైన ఏపిడబ్బ్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, (ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ సమాజ ప్రగతిలో మహిళ కీలకపాత్ర పోషిస్తుందని, మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవభావంతో వ్యవహరించాలన్నారు. మహిళల కోనం ఉన్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవ అధ్యక్షురాలు పైడి రజని మాట్లాడుతూ మహిళల ఆత్మరక్షణకు కుంగ్‌పూ, కరాటే, కిక్ బాక్సింగ్‌లాంటి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడతాయన్నారు. మహిళల రక్షణ కోనం ఉన్న చట్టాలను ఆమె బాలికలకు వివరించారు. సచివాలయ ఉమెన్ ప్రాటెక్షన్ సెక్రటరీ షబానా బేగమ్ మాట్టాడుతూ దిశ చట్టంపై ప్రతి బాలికకు అవగాహన ఉన్నప్పుడు సమాజంలో మార్చు వన్తుందన్నారు. దిశ యాప్, మహిళా చట్టాల గురించి వక్తలు వివరించారు. అనంతరం ఎస్‌ఐ ప్రవల్లిక, పైడి రజని, షబానా బేగమ్‌లను కిక్ బాక్సింగ్, కంగ్‌పూ, కరాటే విద్యార్థినులను సత్కరించారు. తొలుత కుంగ్‌పూ, కిక్‌బాక్సింగ్ క్రీడాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు పైడి గోపాలరావు, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.విజయకుమార్, కార్యదర్శి వై.హేమంత్‌కుమార్, సంయుక్త కార్యదర్శి డి.హరీష్, (ట్రెజరర్ వై.పవన్‌యాదవ్, సాయిబాబా చిల్డ్రన్ కరాటే స్కూల్ డైరెక్టర్ టి.శ్రీనివాసరావు, కుంగ్‌పూ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.చంద్రరావు, కోచ్‌లు గాయత్రీ, సాయి తదితరులు పాల్గొన్నారు.