జిసిసి ఉత్పత్తులను టిటిడి ప్రోత్సహించాలి..
Ens Balu
5
Tirumala
2021-08-30 09:00:24
తిరుమల తిరుపతి దేవస్థానంలో గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులకు అవకాశం కల్పించాలని గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి శోభా స్వాతి రాణి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కోరారు. తిరుమలలో సోమవారం ఆమె చైర్మన్ ను కలిశారు. గిరిజనులు తయారు చేసిన పసుపు. కుంకుమ, తేనె తో పాటు.మరికొన్ని ఉత్పత్తులు ఆయనకు అందజేశారు. టిటిడి జిసిసి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గిరిజనులకు మరింత ఉపాది కలుగుతుందన్నారు. అంతేకాకుండా నాణ్యమైన ఉత్పత్తులను టిటిడి లో వినియోగించడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో పసుపు,కుంకుమ, చింతపండు పండించేట్లైతే టీటీడీ లో అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు.