గుంటూరు జిల్లాలో తెనాలి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను ప్రముఖ రచయిత స్టిఫెన్ డేవిడ్, జిల్లా జి.డి.సి.సి బ్యాంకు మాజీ ఛైర్ పర్సన్ కత్తెర క్రిస్టీనా మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం మద్యాహ్నం తెనాలి ఐతానగర్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను స్థానిక పెద్దలు మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ‘అందరి బంధువు ’ (జీవిత చరిత్ర), కాకతీయ యుగంధర్ ( భారత తొలి ప్రధాన మంత్రి ) ల పేరుతో స్టిఫెన్ డేవిడ్ రచించిన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జి.డి.సి.సి బ్యాంకు మాజీ ఛైర్ పర్సన్ కత్తెర క్రిష్టీనా, స్థానిక నేతలు కలిసి రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెనాలి మున్సిపల్ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.